ఆర్మూర్–సికింద్రాబాద్ కొత్త రైల్వే లైన్‌కు అడుగులు

by Batti.Sumithra |

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం కలిశారు.

ఆర్మూర్–సికింద్రాబాద్ కొత్త రైల్వే లైన్‌కు అడుగులు
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం కలిశారు. ఆర్మూర్- సికింద్రాబాద్ వయా డిచ్ పల్లి మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ఆర్మూర్ ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రైల్వేలైన్ ఏర్పాటు అయి అందుబాటులోకి వస్తే ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు, జగిత్యాల జిల్లా ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత సౌకర్యంగా సులభతరంగా మారుతుంది అని అన్నారు. అలాగే హైదరాబాద్ ముంబయి రైళ్లు నిజామాబాదు మీదుగా మరింత ఎక్కువ రైళ్లు నడపాలి అని, మూడు లైన్లు వేయాలని రైల్వే మంత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వినతి పత్రంలో కోరారు.

Next Story