- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని రైల్వే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని రైల్వే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాలకు వంద శాతం కేంద్ర నిధులు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణ పరిహారం కోసం మిగిలిన రూ.14.89 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు.అలాగే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాటిగూడ వరకు పాదచారులు, ద్విచక్ర వాహనాల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ), గిమ్మ, బోరాజ్, మహాలక్ష్మీవాడ, ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం కొత్త రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.ఆదిలాబాద్ అభివృద్ధికి అవసరమైన రైల్వే మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.






