- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bank Deposits: కేవలం 15 రోజుల్లో రూ. 7 లక్షల కోట్ల డిపాజిట్లు
గత 29 ఏళ్ల బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయి డిపాజిట్లు పెరగడం ఇది మూడవసారి అని నివేదిక తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 15 రోజుల్లోనే రికార్డు స్థాయి డిపాజిట్లు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల్లో ఏకంగా రూ. 6.97 లక్షల కోట్ల మేర కొత్త డిపాజిట్లు జమయ్యాయి. గత 29 ఏళ్ల బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయి డిపాజిట్లు పెరగడం ఇది మూడవసారి అని నివేదిక తెలిపింది. జూన్ నెలాఖరుతో మొదటి త్రైమాసికం ముగియడం వల్ల కంపెనీలు తమ నిధులను డిపాజిట్ చేయడం ఒక కారణమైతే, విదేశీ కరెన్సీ డిపాజిట్లు, విదేశీ రుణాల (ఈసీబీ) ద్వారా వచ్చిన మూలధనం మరొక కారణం. ఈ భారీ డిపాజిట్లతో బ్యాంకుల్లో నగదు కొరత తీరిపోయి, మార్కెట్లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) మరింత సులభతరం కానుంది. దీనివల్ల బ్యాంకులు గతంలో లాగా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ల (సీడీ) ద్వారా మార్కెట్ నుండి ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుందని నివేదిక వివరించింది.
ప్రధానంగా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రభుత్వం తీసుకున్న చొరవతో భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు (ఎఫ్ఐఐ) వరదలా వస్తున్నాయి. ఈ త్రైమాసికంలో కొత్తగా 7 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు రాగా, మొత్తం విదేశీ మూలధన ప్రవాహాల పరిమాణం సుమారు 15 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన విదేశీ మారక నిల్వలు మరో 4.4 బిలియన్ డాలర్లు పెరిగాయని నివేదిక పేర్కొంది.






