ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2026-07-11 14:24:02  IST  )

మండలంలోని చందారం గ్రామానికి చెందిన తుమ్మ అర్చన (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట : మండలంలోని చందారం గ్రామానికి చెందిన తుమ్మ అర్చన (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వివరాల ప్రకారం అర్చన గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమించగా, ఆ ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై దిగులుగా ఉండేదని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ, శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు. శనివారం అర్చన తండ్రి ఆటో నడిపేందుకు వెళ్లగా, తల్లి భారతి, తమ్ముడు కాలనీలోని ఆలయానికి వెళ్లారని తెలిపారు. ఈ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అర్చన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను ఉరివేసుకున్న స్థితిలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి తుమ్మ భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోపతి సురేష్ వెల్లడించారు.

Next Story