- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీఎస్‌కు మరో క్రీడా కిరీటం
by Jakkula.Mamatha |
పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్(కేపీఎస్) విద్యార్థిని అల్లె హేమ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చింది.

X
దిశ, కోరుట్ల టౌన్: పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్(కేపీఎస్) విద్యార్థిని అల్లె హేమ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చింది. కోరుట్ల మినీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో అండర్-14 బాలికల 60 మీటర్ల పరుగు పందెంలో మెరుపు వేగంతో గమ్యాన్ని చేరుకున్న హేమ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకునr స్వర్ణ పతకంతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకుంది. హేమ విజయం పై వైస్ ప్రిన్సిపాల్ గుజ్జెటి కవిత, కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్‌లు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు రాణించేందుకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తోందని వారు పేర్కొన్నారు.
Next Story






