పంటల మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తప్పని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారు.

పంటల మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తప్పని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. శనివారం కమిషన్​సభ్యులు కెవీఎన్​రెడ్డి తో కలిసి ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం రైతులకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. పంట సాగు సమయంలో పెట్టుబడి సాయం అందించిన సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతాంగం తరఫున రైతు కమిషన్ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పంటల మార్పిడిపై రైతులకు సూచనలు చేశారని, అదే అంశంపై రైతు కమిషన్ కూడా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించిందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి అవసరమని కేంద్ర ప్రభుత్వం కూడా సూచిస్తోందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మళ్లీ తమ ప్రాంతాల్లో అనుకూలమైన సంప్రదాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని, పంటల వైవిధ్యాన్ని పెంచడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Next Story