Nita Ambani: ఫార్చ్యూన్ ఇండియా 'పవర్‌ఫుల్ ఉమెన్‌'గా నీతా అంబానీ

by S Gopi |

సంస్థాగత నిర్మాణం, సమ్మిళిత వృద్ధి, సామాజిక సేవలో ఆమె చూపిన లీడర్‌షిప్‌కి ఈ గౌరవం లభించింది.

Nita Ambani: ఫార్చ్యూన్ ఇండియా పవర్‌ఫుల్ ఉమెన్‌గా నీతా అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సంస్థాగత నిర్మాణం, సమ్మిళిత వృద్ధి, సామాజిక సేవలో ఆమె చూపిన లీడర్‌షిప్‌కి ఈ గౌరవం లభించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, మహిళా సాధికారత వంటి రంగాల్లో దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ప్రజల జీవితాలపై ఆమె ప్రభావం చూపగా, అందులో 2.9 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు రిలయన్స్ తెలిపింది. ఇదే సమయంలో అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) ఆమెకు ప్రతిష్ఠాత్మక హ్యుమానిటేరియన్ అవార్డును ప్రదానం చేయగా, ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజాభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అంతేకాకుండా, ఫ్లోరిడాలోని టాంపా నగరం అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటైన 'కీ టు ది సిటీ ఆఫ్ టాంపా'ను కూడా నీతా అంబానీకి అందజేశారు. సామాజిక మార్పు, మానవతా సేవల్లో ఆమె చేసిన కృషికి ఇది అంతర్జాతీయ స్థాయిలో లభించిన మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది.

Next Story