అభిమానుల వల్లే ఇక్కడ ఉన్నా.. స్టేజ్‌పైనే ఎమోషనలైనా Bhagyashri Borse

by Chukka Sudharani |   (  Updated:2026-07-11 16:00:09  IST  )

అక్కినేని హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

అభిమానుల వల్లే ఇక్కడ ఉన్నా.. స్టేజ్‌పైనే ఎమోషనలైనా Bhagyashri Borse
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతుండగా.. తాజాగా టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లెనిన్చత్రంతో తన కూడా హిట్ రావడంతో స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది హీరోయిన్ భాగ్యశ్రీ. ‘ఈ రోజు నేను చాలా ఎమోషనల్‌గా ఉన్నాను. అందుకే నా మనసులో ఉన్నది మాట్లాడాలనుకుంటున్నా. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణమైన వ్యక్తి, మా దర్శకుడు మురళి కిశోర్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. మీరు నాకు 'భారతి' పాత్ర ఇవ్వకపోయి ఉంటే, ఈ రోజు నాకు ఇంతటి ప్రశంసలు దక్కేవి కావు. నా మీద నమ్మకం ఉంచి, నన్ను భారతిగా తెరపై నిలబెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపారు. అలాగే హైదరాబాద్‌ను తన 'కర్మభూమి'గా అభివర్ణించిన భాగ్యశ్రీ బోర్సే.. తాను నటించే చివరి చిత్రం ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుందని చెబుతూ సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story