తెలంగాణలో రైతు డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో రైతు డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ మేర‌కు టీజీఆర్‌పీడీసీఎల్ ‌కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) లైసెన్స్ జారీ చేసింది.

తెలంగాణలో రైతు డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో రైతు డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ మేర‌కు టీజీఆర్‌పీడీసీఎల్ ‌కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) లైసెన్స్ జారీ చేసింది. దీంతో నాలుగు నెలల్లో దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను మాత్రం కొనసాగించనున్నారు. మోటార్లకు మీటర్లు ఉండవని ఈఆర్సీ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ, ఎత్తిపోతల, ప్రభుత్వ నీటి సరఫరా పథకాలకు నిరంతరం విద్యుత్ అందించేందుకు రైతు డిస్కం ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ డిస్కంల నుండి వ్యవసాయ, మిషన్ భగీరథ కనెక్షన్లను తొలగించి రైతు డిస్కంకు బదిలీ చేస్తారు. సచివాలయం వెనుక నిర్మిస్తున్న రెడ్కో భవనంలో ఈ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న రైతు డిస్కం నిర్ణ‌యంతో దేశంలోనే వ్య‌వ‌సాయానికి ప్ర‌త్యేకంగా డిస్కం క‌లిగిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించ‌నుంది.

Next Story