గాంధీభవన్‌లో జవహర్ బాల్ మంచ్ రెండు రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరం

by Ajay Maddhiboyina |

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం గాంధీ భవన్‌లో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరానికి జవహర్ బాల్ మంచ్ జాతీయ అధ్యక్షులు జీవీ హరి అధ్యక్షత వహించగా

గాంధీభవన్‌లో జవహర్ బాల్ మంచ్ రెండు రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం గాంధీ భవన్‌లో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరానికి జవహర్ బాల్ మంచ్ జాతీయ అధ్యక్షులు జీవీ హరి అధ్యక్షత వహించగా, తెలంగాణ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ అడ్వకేట్ మామిడి రిషికేశ్ రెడ్డి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి జవహర్ బాల్ మంచ్ జాతీయ సమన్వయకర్తలు, రాష్ట్ర చైర్మన్లు ఈ మిరాయి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. యువ నాయకుల్లో నాయకత్వ లక్షణాలు, సంస్థాగత నైపుణ్యాలు మరియు సేవాభావాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ శిక్షణ శిబిరం ప్రధాన లక్ష్యమని నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ జవహర్ బాల్ మంచ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించడంతో పాటు, తెలంగాణలో నిర్వహించనున్న తదుపరి జాతీయ బాలల శిబిరానికి కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నేటి తరానికి భారతదేశ ఆలోచన, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరియు కాంగ్రెస్ సిద్ధాంతాలను చేరవేయాల్సిన అవసరం ఉందదని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలని పిలుపు ఇచ్చారు. నెహ్రూ, గాంధీ భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

నేషనల్ టాలెంట్ హంట్ ప్రాథమిక ఇంటర్వ్యూలలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...

అధికార ప్రతినిధి, రీసెర్చర్, పబ్లిసిటీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ కోసం గాంధీభవన్ లో శనివారం నిర్వహించిన నేషనల్ టాలెంట్ హంట్ ప్రాథమిక ఇంటర్వ్యూ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, ప్రజా అవగాహన, సంస్థాగత పనితీరుపై అవగాహన వంటి అంశాలను పరిశీలించారు. ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే యువతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సమాజ సేవ పట్ల నిబద్ధతతో పాటు ప్రజలతో మమేకమై పనిచేసే సామర్థ్యం ఉన్న యువతను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ టాలెంట్ హంట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని టీపీసీసీ చీఫ్ తెలిపారు.

Next Story