- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడి.. బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
స్థలం పరిశీలించేందుకు వెళ్లిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది.

దిశ,మేడిపల్లి: స్థలం పరిశీలించేందుకు వెళ్లిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిల్కానగర్‌కు చెందిన షావలి శ్రీరామ్ తన సహచరుడు స్వామి యాదవ్‌తో కలిసి స్థలం కొనుగోలు కోసం శ్రీనివాస కాలనీలోని వాటర్ ట్యాంక్ సమీపానికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారితో గొడవకు దిగి, కర్రలతో దాడి చేశారు. నిందితుల్లో ఒకరు తాను పోలీసు శాఖలో పనిచేస్తున్నానని చెప్పుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో స్వామి యాదవ్ తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోగా, అదే అవకాశంగా అతని మెడలో ఉన్న బంగారు గొలుసు, మోటార్‌సైకిల్ తాళాలు తీసుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.






