శ్రీధర్ బాబు మృతి కేసులో కీలక మలుపు..

by Taduka Kalyani |

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన శ్రీధర్ బాబు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

శ్రీధర్ బాబు మృతి కేసులో కీలక మలుపు..
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన శ్రీధర్ బాబు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన పలు ఆధారాలను ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్‌కు అందజేశారు. శ్రీధర్ బాబు మృతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీయాలని కుటుంబ సభ్యులు ఏసీపీని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేసిన వారు.. విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటన వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలని, బాధ్యులు ఎవరైనా చట్టం ముందు నిలబడాలని కోరారు. శ్రీధర్ బాబుకు జరిగిన అన్యాయంపై నిష్పాక్షిక విచారణ జరిపి న్యాయం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో సమర్పించిన ఆధారాలను పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story