- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో అల్వాల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు
by Jakkula.Mamatha |
ఎక్కడో దూరంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం త్వరలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృషితో అల్వాల్‌లో ఏర్పాటు కానున్నట్లు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

X
దిశ, అల్వాల్: ఎక్కడో దూరంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం త్వరలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృషితో అల్వాల్‌లో ఏర్పాటు కానున్నట్లు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్ స్పూర్తి జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అల్వాల్ ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బాల భవన్‌లో సబ్-రిజిస్ట్రార్(రిజిస్ట్రేషన్) కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్‌కు విన్నవించిన విషయం విధితమే. ఈ ప్రతిపాదన అమలులో భాగంగానే అధికారుల బృందం పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రేమ్ కుమార్, యాదగిరి పాల్గొన్నారు.
Next Story






