- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నారంలో అగ్నిప్రమాదం...
గుమ్మడిదల మున్సిపల్ అన్నారం గ్రామం ప్రకృతి నివాస్ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,జిన్నారం: గుమ్మడిదల మున్సిపల్ అన్నారం గ్రామం ప్రకృతి నివాస్ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన విలువైన ఆస్తులు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్, గుర్తింపు కార్డులు, బంగారు ఆభరణాలు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుడు సోలమన్ కథనం ప్రకారం.. జూలై 10 రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా కింద అంతస్తులో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పొరుగింటి వ్యక్తి శ్యాంప్రసాద్ మంటలను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి స్థానికులతో కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాదంలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు గొలుసు, ఉంగరాలు, చెవిపోగులు, నగదు, ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్‌బుక్స్, ఆర్సీ బుక్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదేవిధంగా బంధువులు, స్నేహితులు భద్రపరిచిన విద్యా ధ్రువపత్రాలు కూడా కాలిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. టెలివిజన్, ఫర్నిచర్, వార్డ్‌రోబ్‌లు, మంచాలు, దుస్తులు, విద్యుత్ పరికరాలు, గృహోపకరణాలు సహా అనేక విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంతో తమ కుటుంబానికి లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






