- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఇంటి చోరీల కేసును ఛేదించిన సైదాబాద్ పోలీసులు
నగరంలో వరుస ఇంటి చోరీలకు పాల్పడుతున్న నేరస్థుడిని సైదాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి, పలు కేసులను ఛేదించారు.

దిశ, చంపాపేట్, జూలై 11: నగరంలో వరుస ఇంటి చోరీలకు పాల్పడుతున్న నేరస్థుడిని సైదాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి, పలు కేసులను ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 167/2026 కేసులో మే 12న గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటిలో చొరబడి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో పాటు ప్రత్యేక క్రైమ్ పట్రోలింగ్ నిర్వహిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జూలై 10న లక్ష్మీనగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సైదాబాద్‌తో పాటు ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఇంటి చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
అరెస్టైన నిందితుడు మొహమ్మద్ జమీన్ హుస్సేన్ అలియాస్ అబ్బు (27)గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం బండ్లగూడలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అతడు ర్యాగ్‌పికర్‌గా జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిపై గతంలో 17 కేసులు నమోదై ఉండగా, ప్రస్తుతం సైదాబాద్, చాదర్‌ఘాట్, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఆరు ఇంటి చోరీ కేసుల్లో అతడి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2 గ్రాముల బంగారు చెవిపోగులు, 1 గ్రాము లక్ష్మీదేవి బంగారు నాణెం, మరో 2 గ్రాముల బంగారు చెవిపోగు, 8 గ్రాముల బంగారు బుట్టాలు, 12 గ్రాముల బంగారు పుస్తెల తాడు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన బృందంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రవికుమార్, ఎస్‌ఐ పి. వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ అశోక్ కుమార్, పోలీసు సిబ్బంది గంగాసాయి కిరణ్, కవేటి శివశంకర్, పి. సాయివిక్రమ్ కుమార్, ఎ. క్రాంతికుమార్, ఎం. నాగరాజు, బి. విజయ్ కుమార్ పాల్గొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి పలు చోరీ కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే ప్రభాకర్, ఐపీఎస్, అదనపు డీసీపీ మహ్మద్ మజీద్, సైదాబాద్ ఏసీపీ ఎస్. వెంకటరెడ్డి పర్యవేక్షణలో సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ బి. చంద్ర మోహన్ అభినందించారు.






