- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో మహిళ పుస్తెలతాడు చోరీ..
by Jakkula.Mamatha |
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలోని సుమారు ఐదు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ,మేడిపల్లి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలోని సుమారు ఐదు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా బాలసముద్రానికి చెందిన మర్రి అరుణ(67) ఈ నెల 10న తార్నాక నుంచి బోడుప్పల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు నెం. 280లో ప్రయాణించారు.బోడుప్పల్ బస్ డిపో వద్ద బస్సు దిగిన తర్వాత మెడలో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు మంగళసూత్రం కనిపించకపోవడంతో, బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






