- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుల్కల్‌లో పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి.. ముగ్గురు అరెస్ట్
బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బిచ్కుంద పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

దిశ, బిచ్కుంద (నిజాంసాగర్) : బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బిచ్కుంద పోలీసులు శనివారం మెరుపు దాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించగా, నిందితులు పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.4,600 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజు మాట్లాడుతూ జూదం వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తుందని అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చర్యలు ఇకముందు కూడా నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.






