ITR Filing: ఇప్పటికే 1.7 కోట్ల రిటర్న్‌లు దాఖలు

by S Gopi |

ఇప్పటికే 1.7 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లు దాఖలు చేసినట్లు శనివారం ప్రకటనలో వెల్లడించింది.

ITR Filing: ఇప్పటికే 1.7 కోట్ల రిటర్న్‌లు దాఖలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ అత్యంగ వేగంగా జరుగుతోందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇప్పటికే 1.7 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లు దాఖలు చేసినట్లు శనివారం ప్రకటనలో వెల్లడించింది. ఇందులో శుక్రవారం ఒక్క రోజే 10 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలవడం విశేషం. జీతం, ఒక ఇంటి ఆస్తి, ఏడాదికి రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం కలిపి వార్షిక ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న వ్యక్తులు ఐటీఆర్-1 ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఇక వ్యాపార ఆదాయం లేకపోయినా, మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఐటీఆర్-2 ఫారాన్ని ఉపయోగించాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలుకు జూలై 31 చివరి తేదీ కావడంతో, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్ ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది.

Next Story