ఆ ఊరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న నల్ల కుక్క

by Jakkula.Mamatha |

మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాథపురం, వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో సంచరిస్తున్న ఓ నల్ల కుక్క స్థానికులకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.

ఆ ఊరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న నల్ల కుక్క
X

దిశ,మల్కాజ్గిరి: మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాథపురం, వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలో సంచరిస్తున్న ఓ నల్ల కుక్క స్థానికులకు తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. తాజాగా మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ కుక్క ఇప్పటికే పిల్లలు, వృద్ధులతో పాటు పలువురిపై దాడి చేసి గాయపరిచింది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారుల వెంటపడటంతో వారు అదుపు తప్పి కింద పడిపోయి గాయపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఈ సమస్యపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలు పట్టుకునే వాహనం ఆలస్యంగా రావడం, వచ్చినా కుక్క దొరకలేదని చెప్పి వెళ్లిపోవడం తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ప్రజలకు ప్రమాదంగా మారిన ఈ కుక్కను పట్టుకుని తరలించి, స్థానికులకు భద్రత కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Next Story