కేటీఆర్‌ను కలిసిన డాక్టరేట్ గ్రహీత కొండ గణేష్

by Batti.Sumithra |

నల్గొండ జిల్లా కనగల్ మండలం అమ్మగూడెం గ్రామానికి చెందిన కొండ గణేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

కేటీఆర్‌ను కలిసిన డాక్టరేట్ గ్రహీత కొండ గణేష్
X

దిశ, కనగల్ : నల్గొండ జిల్లా కనగల్ మండలం అమ్మగూడెం గ్రామానికి చెందిన కొండ గణేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గణేష్ పరిశోధన (థీసిస్) వివరాలను అడిగి తెలుసుకుని అభినందించారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు డా. దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్, డా. చిరుమిల్ల రాకేష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కొండ గణేష్‌కు అభినందనలు తెలిపారు.

Next Story