- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ డివిజన్‌లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

దిశ , కాప్రా: కుషాయిగూడ డివిజన్‌లో దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం రూ.2.30 కోట్ల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్లు, ధ్వంసమైన రోడ్ల ఏర్పాటు పనులపై పలు కాలనీలో పర్యటించి కాలనీవాసులతో స్థానిక సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన కాలనీలో బస్తీలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాలనీల్లో, బస్తీలలో ధ్వంసమైన రోడ్ల ఏర్పాటుతోపాటు కొత్త బీటీ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
అలాగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రహదారులు పూర్తయితే ప్రజల రాకపోకల సౌకర్యం ఎంతో మెరుగ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మారుతి ఎంక్లేవ్ రోడ్ నెంబర్ 1 నుంచి 13 వరకు, థీమ్ పార్కు నుంచి పోచమ్మ గుడి వరకు, వైష్ణవి ఎంక్లేవ్‌లో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కాలనీ వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, గిరిబాబు, కాలనీవాసులు దేవేందర్ రెడ్డి, నవీన్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






