ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

by Jakkula.Mamatha |

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా జరిగేలా బిఎల్ఏలు బాధ్యతగా వ్యవహరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా జరిగేలా బిఎల్ఏలు బాధ్యతగా వ్యవహరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం 43వ డివిజన్లోని పలు గ్రామాల్లో బిఎల్ఏలకు తిమ్మాపురులోని క్యాంపు కార్యాలయంలో హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, SIR ప్రక్రియ సౌమ్య-దిలీప్ రాజ్‌ల అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎంత శాతం పూర్తయింది.

ఓటర్లు అందరికి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయిందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారంలో పొందుపర్చిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని బిఎల్ఏలను ఆదేశించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తారని వివరించారు. బిఎల్ఏలకు సర్ ప్రక్రియ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాడుగుల రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అరుణ విక్టర్, మాజీ డివిజన్ అధ్యక్షులు చింత, మాజీ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ప్రకాష్, సీనియర్ నాయకులు గంటా నరేందర్ రెడ్డి, శివ కుమార్, కొమురెల్లి యాదవ్, అరుణ, దశరథం, సుభాకర్, జాన్సన్, కాగిత రాజు, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story