- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భార్య కాపురానికి రావడంలేదని అత్తమామను కారుతో ఢీ కొట్టిన అల్లుడు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని అల్లుడు కారుతో అత్తమామను ఢీ కొట్టాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన రాజబాబు అనే వ్యక్తి మంగళగిరికి చెందిన ఓ యవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని అల్లుడు కారుతో అత్తమామను ఢీ కొట్టాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన రాజబాబు అనే వ్యక్తి మంగళగిరికి చెందిన ఓ యవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తరచూ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంతచెప్పినా తిరిగి కాపురానికి రాలేదు. భార్య పుట్టింటికి రాకపోవడానికి అత్తమామలే కారణం అని భావించి వారిపై పగ పెంచుకున్నాడు. దీంతో అత్తమామలు పద్మావతి, శ్రీనివాసరావులను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఓ సుపారీ గ్యాంగ్ ను నియమించుకుని వారికి రూ.20వేల సుపారీ ఇచ్చాడు. మొదట మంగళగిరిలో వారికి స్కెచ్ వేయగా సుపారీ గ్యాంగ్ నుండి తప్పించుకున్నారు. తప్పించుకోవడంతో స్వయంగా తానే రంగంలోకి దిగి గత నెల 26వ తేదీన వాళ్లు మంగళగిరి ఆర్అండ్ బీ జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఢీ కొట్టిన అనంతరం ఆగకుండా పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. మొదట ఇది సాధారణ రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ తరవాత అనుమానం రావడంతో పోలీసులు విచారించగా అల్లుడు రాంబాబే కారుతో ఢీ కొట్టాడని తెలిసి అరెస్ట్ చేశారు.






