సీఎం రేవంత్‌ను కలిసిన ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్

by Ajay Maddhiboyina |

ప్రముఖ విమానాల సంస్థ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థథ 25వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూబ్లిహిల్స్ తో భేటీ అయ్యారు.

సీఎం రేవంత్‌ను కలిసిన ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ విమానాల సంస్థ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థథ 25వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూబ్లిహిల్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు రెండు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని మరిన్ని విమాన సర్వీలసును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీంతో హైదరాబాద్ కు ఏ 380 విమాన సర్వీసులను తీసుకువచ్చేందుకు వారు ఆసక్తిచూపించారు.

ఎమిరేట్స్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చాారు. అంతేకాకుండా గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్ షిప్ చేయాలని సైతం రేవంత్ కోరారు. దీనిపై సైతం ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. ఇక త్వరలో తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అందులో వరంగల్ లో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో మరొకటి నిర్మిస్తున్నారు. కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తే విమానాలు కూడా అవసరం అవుతాయి ఈ నేపథ్యంలోనే సీఎం ఎమిరేట్స్ సర్వీసులు పెంచాలని ముందుగానే కోరారు.

Next Story