తిన్న వెంటనే ఆకలి వేస్తుందా?

by Sujitha Rachapalli |   (  Updated:2026-07-11 11:59:33  IST  )

తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తుందా? ఎంత తిన్నా, ఎంత నిద్రపోయినా ఇంకా అలసటగానే ఉంటుందా? ఇది మీ శరీరంలో ఏదో లోపం ఉందని సూచిస్తున్న సంకేతం అంటున్నారు నిపుణులు. ప్రధాన పోషకాహార లోపాల ముందస్తు సంకేతాలను వివరిస్తున్నారు.

తిన్న వెంటనే ఆకలి వేస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తుందా? ఎంత తిన్నా, ఎంత నిద్రపోయినా ఇంకా అలసటగానే ఉంటుందా? ఇది మీ శరీరంలో ఏదో లోపం ఉందని సూచిస్తున్న సంకేతం అంటున్నారు నిపుణులు. ప్రధాన పోషకాహార లోపాల ముందస్తు సంకేతాలను వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం.

ఫైబర్ లోపం

డాక్టర్ పాల్ ప్రకారం.. ఫైబర్ లోపం ముందు సంకేతం మలబద్ధకం కాదు. భోజనం చేసిన వెంటనే ఆకలి వేయడం. ఇది మీ ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, జీర్ణక్రియ సరిగ్గా జరకపోవడానికి సంకేతం. ఇలాంటప్పుడు కందులు, బీన్స్ (బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, చిక్‌పీస్), ఓట్స్ వంటి ధాన్యాలు, చియా సీడ్స్, అవకాడో, రాస్ప్‌బెర్రీ, పియర్స్, యాపిల్, బ్రోకలీ, స్వీట్ పొటాటో వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రోటీన్ లోపం

ప్రోటీన్ లోపం అంటే వెయిట్ లాస్ కావడం కాదు. దీనికి ముందు స్థిరమైన అలసట, మతి మరుపు వస్తాయి. శరీరానికి ఫోకస్, శక్తికి అవసరమైన అమైనో ఆమ్లాలు లభించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు, బాదం, చికెన్ బ్రెస్ట్, కాటేజ్ చీజ్, గ్రీక్ యోగర్ట్, పాలు తీసుకోవాలి. మొక్కల ఆధారిత ప్రోటీన్ లభించే.. కందులు, చిక్‌పీస్, బీన్స్, క్వినోవా, పంప్కిన్ సీడ్స్‌ కూడా మంచి ప్రోటీన్ మూలాలు. కాగా చేపలు, వేరుశెనగ, ప్రోటీన్ పౌడర్ కూడా మంచివి.

కాల్షియం లోపం

కాల్షియం లోపం అంటే ముందుగా ఎముకలు బలహీనం కావడం కాదు. వేళ్లలో తిమ్మిరి రావడం ఫస్ట్ సంకేతం. నరాలు, కండరాల పని ఆటంకం వల్ల ఇలా జరుగుతుంది. యోగర్ట్, పాలు, చీజ్, సార్డైన్స్, సాల్మన్, టోఫు, నట్స్, సీడ్స్, కాలే, లెగ్యూమ్స్, ఫోర్టిఫైడ్ సోయా మిల్క్ మొదలైనవి కాల్షియం మూలాలు. కాగా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

జింక్ లోపం

జింక్ లోపం అంటే ఆకలి తగ్గడం కాదు. రుచి, వాసన తగ్గడం. గాయాలు నయం కావడం ఆలస్యం అయ్యే సంకేతాలు. ఇలాంటప్పుడు ఆయిస్టర్స్, గుమ్మడి గింజలు, కాజూ, శనిగలు, కందులు, ఫోర్టిఫైడ్ సెరియల్స్‌లో జింక్ అధికంగా ఉంటుంది.

ఐరన్ లోపం

ఐరన్ లోపం ముందు జుట్టు రాలడం లేదా కనురెప్పల క్రింద నలుపు రావడం కాదు. రాత్రి హాయిగా నిద్రపోయినా అలసటగా ఉండడం. ఇది కణాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరుగుతుంది. రెడ్ మీట్, పాలకూర, కందులు, టోఫు, క్వినోవా, ఫోర్టిఫైడ్ ధాన్యాలు తీసుకోవడం మంచిది. విటమిన్ సి ఉన్న ఆహారాలు (నారింజ, బెల్ పెప్పర్స్)తో కలిపి తినడం శోషణను పెంచుతుంది.

విటమిన్ సి లోపం

విటమిన్ సి లోపం అంటే తరచూ జలుబు చేయడమని అనుకుంటాం. కానీ చిగుళ్ల నుంచి రక్తస్రావం, చర్మం పొడిబారడం, సులభంగా గాయాలు అయ్యే సంకేతాలు. కొలాజెన్ ఉత్పత్తి తగ్గడం ఇందుకు దారి తీస్తుంది. నారింజ, స్ట్రాబెర్రీ, కివి, బెల్ పెప్పర్స్, బ్రోకలీ, టమాటాలు విటమిన్ సి మూలాలు.

విటమిన్ B12 లోపం

B12 లోపానికి కేవలం అలసట మాత్రమే సంకేతం కాదు. చేతులు/కాళ్లలో తిమ్మిరి, పాలిపోయిన చర్మం, మెదడు మతి మరుపు కూడా సంకేతాలు. నాడీ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటప్పుడు విటమిన్ బి12 సోర్సెస్‌గా ఉన్న గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్, చేపలు, చికెన్, ఫోర్టిఫైడ్ సోయా మిల్క్, న్యూట్రిషనల్ ఈస్ట్, బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్ తీసుకోవాలి.

Next Story