- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో పానీపూరి టేస్ట్ చేసిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ హైదరాబాద్ లో పానీపూరిని టేస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. హెచ్ఐసీసీసీ లో నిర్వహించిన వికసిత్ భారత్ 2047 - సాంకేతికత పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చాట్ బండార్ స్టాల్ ఆయన్ను ఆకర్షించింది. వెంటనే తనకూ ఓ ప్లేట్ పానీ పూరి ఇవ్వాలని కోరగా.. వారు పారీలు, ఒక గ్లాసులో పానీ, అందులోకి మసాలా స్టఫ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అవన్నీ తీసుకున్న అశ్వినీ వైష్ణవ్.. వెంటనే తన యూపీఐ ద్వారా రూ.175 చెల్లించారు.
భారతదేశంలో వీధి వ్యాపారుల స్థాయి నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు యూపీఐ (Unified Payments Interface) ఎంతలా విస్తరించిందో చెప్పడానికి ఈ ఘటన ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, స్థానిక స్టాల్ నిర్వాహకులను పలకరించి, వారితో ముచ్చటించడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






