అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. సొత్తు స్వాధీనం

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-11 10:07:15  IST  )

వరంగల్ మహా నగర పరిధిలోని 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాకలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. సొత్తు స్వాధీనం
X

దిశ, గీసుకొండ: వరంగల్ మహా నగర పరిధిలోని 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాకలో చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. ఈ నెల 10వ తేదీన జాన్‌పాక గ్రామ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టిపల్లి గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లాకు చెందిన నందిపాటి జార్జ్ రమణయ్య( 64) అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి ట్రాన్స్‌ఫార్మర్ వెనుక దాక్కోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా వరంగల్ నగరం ఆదర్శ్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు 50 గ్రాములు , ఒక గ్రాము బంగారు ఉంగరం దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతోనే ఈ దొంగతనం చేశానని చెప్పాడు. దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

Next Story