- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌ఐటీని సందర్శించిన తైవాన్ ప్రొఫెసర్లు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ వరంగల్)ని తైవాన్‌లోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) ప్రొఫెసర్లు ప్రొ.షు-యువాన్ పాన్, ప్రొ.చెంగ్-చున్ హీ సందర్శించారు.

దిశ, హన్మకొండటౌన్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ వరంగల్)ని తైవాన్‌లోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ) ప్రొఫెసర్లు ప్రొ.షు-యువాన్ పాన్, ప్రొ.చెంగ్-చున్ హీ సందర్శించారు. కార్బన్ డైఆక్సైడ్(CO₂)ను సంగ్రహించి ఉపయోగకరమైన ఇంధనంగా మార్చే నూతన సాంకేతికతలపై ఎన్‌ఐటీ వరంగల్ అధ్యాపకులు, పరిశోధకులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా జులై 3 నుంచి 9వ తేదీ వరకు “CO₂ టు ఫ్యూయల్స్” పేరుతో ఏడు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను ఎన్‌ఐటీ వరంగల్ నిర్వహించింది.
దేశంలోని వివిధ సంస్థలకు చెందిన సుమారు 50 మంది అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ఆధునిక స్వచ్ఛ ఇంధన సాంకేతికతలపై అవగాహన పొందారు. ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, కాలుష్యం, పెరుగుతున్న స్వచ్ఛ ఇంధన అవసరాలు వంటి ప్రధాన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో అంతర్జాతీయ సహకారం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటీ ప్రొ.లీలా మనోహర్ ఏశాల, ప్రొ.రాజేష్‌ఖన్నా గడ్డం, సిబ్బంది పాల్గొన్నారు.






