వంట విషయంలో వివాదం.. స్నేహితుడి పై కత్తితో దాడి

by Taduka Kalyani |

వంట చేసే విషయంలో తోటి రూమ్ మెట్ మిత్రుడితో గొడవ జరగగా మిత్రుడిని కత్తితో పొడిచి గాయపరచిన ఘటన బొల్లారం పీఎస్ పరిధిలోని గడ్డపోతారంలో జరిగింది.

వంట విషయంలో వివాదం.. స్నేహితుడి పై కత్తితో దాడి
X

దిశ, జిన్నారం: వంట చేసే విషయంలో తోటి రూమ్ మెట్ మిత్రుడితో గొడవ జరగగా మిత్రుడిని కత్తితో పొడిచి గాయపరచిన ఘటన బొల్లారం పీఎస్ పరిధిలోని గడ్డపోతారంలో జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన రవి పటేల్, నిఖిలేష్ కుమార్ లు ఒకే రూమ్ లో అద్దెకు ఉంటూ స్థానిక పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో వంట వండే విషయంలో ఇరువురికి వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రవి పటేల్ తన తోటి మిత్రుడు నిఖిలేష్ కుమార్ ని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన నిఖిలేష్ కుమార్ ని బాచుపల్లిలోని మమత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story