- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్నూర్ లో నూతన తహసీల్దార్ కార్యాలయానికి భూ సర్వే
by Batti.Sumithra |
1946 లో నిర్మించిన మద్నూర్ తహసీల్దార్ కార్యాలయ భవనం 80 ఏళ్లు పూర్తి చేసుకుని శిథిలావస్థకు చేరింది. భవనం కూలిపోయే దశలో ఉండటంతో తహసీల్దార్ ముజీబ్ జిల్లా కలెక్టర్ కు నివేదించారు.

X
దిశ, మద్నూర్ : 1946 లో నిర్మించిన మద్నూర్ తహసీల్దార్ కార్యాలయ భవనం 80 ఏళ్లు పూర్తి చేసుకుని శిథిలావస్థకు చేరింది. భవనం కూలిపోయే దశలో ఉండటంతో తహసీల్దార్ ముజీబ్ జిల్లా కలెక్టర్ కు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం శిథిల భవనాల స్థానంలో 125 తహసీల్దార్, 11 ఆర్డీఓ కార్యాలయాలను కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో మద్నూర్ కూడా ఉంది. శనివారం నూతన భవన నిర్మాణానికి ప్రస్తుత కార్యాలయం పరిసరాల్లోని ప్రభుత్వ భూమిని సర్వేయర్ వెంకట్ ద్వారా సర్వే చేయించారు. తహసీల్దార్ ముజీబ్ స్వయంగా పర్యవేక్షించారు.
Next Story






