- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, చేవెళ్ల : షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఇతర పోలీసు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కలెక్టర్ నారాయణరెడ్డి, ఘటనలో అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కలెక్టర్, ఎమ్మెల్యేకు నిరసన..
బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, పోలీసు అధికారులకు ఆందోళనకారుల నుంచి నిరసన ఎదురైంది. ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






