- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డికి శీల పరీక్ష చేయాలి.. మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ఎత్తిపోతలు, రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఇచ్చిన నివేదికను చూసి అయినా సీఎం సోయి తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డతో పని లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు..
మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసివేయకుండానే కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepali Pump House) నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కేటీఆర్ బహిర్గతం చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 96.79 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉందన్నారు. కానీ కేవలం 94 మీటర్ల లభ్యత ఉంటేనే పంపులను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రకృతి ప్రసాదించిన ఈ ప్రవాహం మరో 100 రోజులు ఇలాగే ఉంటుందని తెలిపారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 200 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే.. గోదావరి బేసిన్‌లోని అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి అన్ని జలాశయాలను నింపి తెలంగాణను సస్యశ్యామలం చేయవచ్చని కేటీఆర్ వివరించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
రాష్ట్రంలో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)ను బద్నాం చేయాలనే కుట్రతోనే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లివ్వడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు. 2022 వరదల ఫోటోలు చూపించి కన్నెపల్లి మునిగిపోయిందంటూ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వల్ల మునిగే భద్రాచలాన్ని పట్టుకుని.. మేడిగడ్డ వల్లే మునుగుతోందని బుర్రలేని మాటలు రేవంత్ మాట్లాడుతుండని కేటీఆర్ ఫైర్ అయ్యారు గోదావరిలో లక్షల క్యూసెక్కుల వరద నీరు కళ్లముందు కిందకు పోతుంటే.. ఎత్తిపోయడానికి నీళ్లు లేవనేవాడు బుర్రతక్కువ వాడా? లేక రైతుల కోసం నీళ్లివ్వమనేవాడు బుర్రతక్కువ వాడా? అని కేటీఆర్
హరీష్‌రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
ఇక మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)పై వస్తున్న పుకార్లను కేటీఆర్ (KCR) గట్టిగా తిప్పికొట్టారు. హరీష్ రావు పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచే కేసీఆర్‌కు రక్షణ కవచంగా నిలిచిన సైనికుడని కేటీఆర్ కొనియాడారు. తనపై వచ్చిన పుకార్లను ఆయన వందల సార్లు తిప్పికొట్టారని అన్నారని.. తమకు క్యారెక్టర్ చాలా ముఖ్యమని అన్నారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి.. హరీష్ రావు శీల పరీక్ష గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్‌తో, రాత్రికి బీజేపీ వాళ్లతో ఉంటారని.. శీల పరీక్ష చేయాల్సింది రేవంత్ రెడ్డికేనని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా.. కనీసం 7 సీట్లు కూడా రావని కేటీఆర్ కామెంట్ చేశారు.






