Editor Viplav: 'బేబీ' సినిమా ఫస్ట్ కట్ రన్‌టైమ్ ఐదు గంటలు.. అప్పుడే దర్శకుడు అలా డిసైడ్ అయ్యారు

by Pulgam srinivas |

'బేబీ' సినిమా మొదట ఐదున్నర గంటల నిడివితో ఉండగా, ఎడిటర్ విప్లవ్ దానిని మూడు గంటలకు కుదించినట్లు వెల్లడించారు.

Editor Viplav: బేబీ సినిమా ఫస్ట్ కట్ రన్‌టైమ్ ఐదు గంటలు.. అప్పుడే దర్శకుడు అలా డిసైడ్ అయ్యారు
X

దిశ, వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ, విరాట్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బేబీ' సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్‌గా పనిచేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విప్లవ్ మాట్లాడుతూ.. "మొదట 'బేబీ' సినిమా నాకు రాలేదు. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యాక నన్ను సంప్రదించారు. అప్పటివరకు వేరే ఎడిటర్ ఆ సినిమాకు పని చేశారు. ఇక సినిమా నా దగ్గరికి వచ్చిన తర్వాత వారు చిత్రీకరించిన మొత్తం ఫుటేజ్‌ను ఒకేసారి చూశాను.

అప్పటికి అది సుమారు నాలుగు గంటల నిడివిలో ఉంది. అనంతరం షూటింగ్ మొత్తం పూర్తయ్యాక సినిమా ఫుటేజ్ దాదాపు ఐదున్నర గంటలకు చేరుకుంది. దానిని నేను మూడు గంటలకు కుదించాను. నాలుగు గంటల ఫుటేజ్ చూసిన తర్వాత సినిమాలో కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించాను. ఆ తర్వాత మొత్తం షూటింగ్ పూర్తయ్యాక సినిమాను మరోసారి చూసి, అవసరమైన మేరకు ఎడిటింగ్ చేశాను. ఫైనల్ వెర్షన్ చూసిన తర్వాత దర్శకుడు సాయి రాజేష్ చాలా ఆనందపడ్డారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఆయనకు కలిగింది. అలా ఐదున్నర గంటల నిడివి ఉన్న 'బేబీ' సినిమాను మూడు గంటలకు తీసుకువచ్చాం" అని విప్లవ్ తెలిపారు.

Next Story