- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వామి సన్నిధిలో నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయ ముఖమండపంలోని బంగారు వాకిలి ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తదనంతరం ఎక్స్‌అఫీషియో సభ్యులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉపాధ్యక్షుడు జి. కిషన్‌రావు, ప్రధానార్చకులు కె. వెంకటాచార్యులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. భవానీశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులను ఒక్కొక్కరిని స్వామివారి గర్భగుడి వద్దకు తీసుకువెళ్లి స్వామివారి సన్నిధిలో బాధ్యతలను నిష్ఠతో నిర్వహిస్తామని ప్రమాణం చేయించారు. అనంతరం ప్రత్యేక దర్శనం నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు అందజేశారు.
నలుగురు గైర్హాజరు..
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులు తూళ్ల విజయేందర్ గౌడ్, నరసింహ్మమూర్తి, ఎక్స్ అఫిషియో సభ్యులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరు కాలేదు.






