- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లో వోల్టేజ్.. కాలిపోతున్న విద్యుత్ పరికరాలు
by Batti.Sumithra |
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో గత వారం రోజులుగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

X
దిశ, కనగల్ : కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో గత వారం రోజులుగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సరైన వోల్టేజ్ లేకపోవడంతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు తదితర విద్యుత్ పరికరాలు పనిచేయకపోవడంతో పాటు కొన్ని పరికరాలు కాలిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వేళల్లో సమస్య మరింత తీవ్రమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, గ్రామానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






