- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మపురిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని టెంపుల్ సిటీ అయిన ధర్మపురిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

దిశ,ధర్మపురి: ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉందని టెంపుల్ సిటీ అయిన ధర్మపురిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కాగా, ధర్మపురిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది మధుసూదన్ రెడ్డి ధర్మపురి క్షేత్రంలో వివిధ అవసరాల నిమిత్తం శనివారం క్లాత్ బ్యాగ్‌లు అందించడానికి రాగ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను పర్యావరణ పరిరక్షణ క్యాప్‌లను మంత్రి అడ్లూరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యంగా గత కొంత కాలంగా ధర్మపురి క్షేత్రంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ గోదావరి ప్లాస్టిక్ రహిత ధర్మపురి నినాదాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందుకు అధికారులు సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి దానిని సమూలంగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.






