నాలుగు నెలలుగా జీతాలు లేవు.. ఆరోగ్య మిత్రుల ఆవేదన

by Batti.Sumithra |

గత నాలుగు నెలలుగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో పనిచేస్తున్న నల్లగొండ జిల్లా ఆరోగ్య మిత్రులకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోగ్య శ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య తెలిపారు.

నాలుగు నెలలుగా జీతాలు లేవు.. ఆరోగ్య మిత్రుల ఆవేదన
X

దిశ, మర్రిగూడ : గత నాలుగు నెలలుగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో పనిచేస్తున్న నల్లగొండ జిల్లా ఆరోగ్య మిత్రులకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోగ్య శ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య తెలిపారు. ఆయన ఇక్కడి విలేకరులతో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతి నెల ఒకటో తేదీన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా, ఆరోగ్య మిత్రులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి, ఇక పై ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story