- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ భారతి చట్టం అమలుకు భూ రీ-సర్వే తప్పనిసరి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని ఖమ్మం ఐడీఓసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని ఖమ్మం ఐడీఓసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబ్‌నగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, సెర్ప్ సీఈవో దివ్య పాల్గొని మాట్లాడారు. వీసీ అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులతో మాట్లాడుతూ.. భూ రీ-సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ అదనపు కలెక్టర్ జెఎల్ బి.హరిప్రియ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడి అశోక్, తదితరులు పాల్గొన్నారు.






