స్కూటీలో నాగు పాము కలకలం

by Batti.Sumithra |

కామారెడ్డి పట్టణంలో ఓ స్కూటీలో నాగు పాము శనివారం కనిపించడంతో స్థానికులు భయపడ్డారు.

స్కూటీలో నాగు పాము కలకలం
X

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి పట్టణంలో ఓ స్కూటీలో నాగు పాము శనివారం కనిపించడంతో స్థానికులు భయపడ్డారు. టేక్రియాల్ గ్రామానికి చెందిన చౌకి కోటేశ్వర్ స్కూటీ పై వస్తుండగా ఇంటర్నేషనల్ హోటల్ వద్ద హెడ్‌లైట్ దగ్గర నుంచి శబ్దం రావడంతో ఆపి చూశాడు. అందులో నాగుపాము ఉండటంతో వెంటనే స్నేహితులు, మెకానిక్‌కు ఫోన్ చేశాడు. మెకానిక్ సహాయంతో స్కూటీ ముందు భాగం తెరిచి పామును బయటకు పంపించారు. రోజూలాగే ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసినట్లు, పాము ఎలా చేరిందో తెలియడం లేదని కోటేశ్వర్ తెలిపాడు.

Next Story