రూ.224 కోట్ల రహదారి పనులకు నేడు శంకుస్థాపన : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

by Batti.Sumithra |

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.

రూ.224 కోట్ల రహదారి పనులకు నేడు శంకుస్థాపన : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్టలో మీడియా సమావేశం నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఆలేరు నియోజకవర్గంలో రూ.224 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారుల నిర్మాణ పనులకు వంగపల్లిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు.

రూ.224 కోట్లతో ఐదు రహదారుల అభివృద్ధి...

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఆలేరు–జీడికల్ రహదారికి రూ.17 కోట్లు, జీడికల్–గుండాల–మోత్కూర్ రహదారికి రూ.35 కోట్లు, వంగపల్లి–ఖప్రాయిపల్లి రహదారికి రూ.90 కోట్లు, ఆలేరు–జగదేవ్‌పూర్ (చల్లూరు, ఇబ్రహీంపూర్ మీదుగా) రహదారికి రూ.61 కోట్లు, తుర్కపల్లి–రంగాపూర్ (మాదాపూర్, చీకటిమామిడి మీదుగా) రహదారికి రూ.20.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి పైలాన్‌ను మంత్రులు ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ రహదారుల నిర్మాణంతో నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

Next Story