అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

by Jakkula.Mamatha |

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం కుమారి సంస్కృతి ముదాల్కర్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది.

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
X

దిశ, ఉప్పల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం కుమారి సంస్కృతి ముదాల్కర్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. రంగ పూజ గణపతి తాళం, వినాయక కౌతం, బ్రహ్మాంజలి, పుష్పాంజలి, రరవెను గోపా బాల, మూషిక వాహన, శివాష్టకం, శివ శివ తరంగం, నవదుర్గ నృత్య రూపకం అంశాలను కళాకారులూ ప్రాణవికా, ఐశ్వర్య, సాన్విక, లక్ష్మి సహస్ర, ఆశ్రిత, శ్రీనిధి రెడ్డి, శ్రీవల్లి, శ్రీలస్య, శ్రేయ, సుమాంజలి , అంజలి, బ్రాహ్మణి మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. నాట్య గురువులు డాక్టర్ పసుమర్తి శేషు బాబు,వాణి రమణ,శ్రీలత నారపురాజు లు ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు.

Next Story