- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ నిర్వహణ పై అధికారులకు డా.ఆనంద్ దిశానిర్దేశం
ఆరోగ్యకరమైన తల్లి, శిశు సంక్షేమం కోసం గర్భధారణల మధ్య సరైన వ్యవధి ఎంతో అవసరమని మేడ్చల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ అన్నారు.

దిశ,మేడ్చల్ బ్యూరో: ఆరోగ్యకరమైన తల్లి, శిశు సంక్షేమం కోసం గర్భధారణల మధ్య సరైన వ్యవధి ఎంతో అవసరమని మేడ్చల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ జనాభ దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ద్వారా కుటుంబాల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సహజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, కీసర డివిజన్ ఉప జిల్లా వైద్యాధికారులు డా.లావణ్య, డా.గీత, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా.గీత, డా.శ్రీదేవి, డా.నాగరాజు, డా.పవన్ రెడ్డి, డా.కౌశిక్, డెమో వసంత రెడ్డి, ఉషారాణి, విజయ్ కుమార్, జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నులి పురుగుల నివారణే లక్ష్యం..
నులిపురుగుల నివారణే లక్ష్యంగా పనిచేయాలని మేడ్చల్ వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ అన్నారు. జులై 13న జాతీయ క్రిమి నిర్మూలన దినోత్సవాన్ని, 20న మాప్ ఆఫ్ డే ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమ నిర్వహణ పై అధికారులకు ఆనంద్ దిశానిర్దేశం చేశారు. నులిపురుగుల నివారణ కోసం ఆరోగ్య, విద్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు సమాజ స్థాయిలో ఆల్బెండజోల్ మాత్రలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్రను పొడి చేసి నీటితో ఇవ్వాలని, 2–3 సంవత్సరాల పిల్లలకు ఒక పూర్తి మాత్రను పొడి చేసి నీటితో ఇవ్వాలని వివరించారు. జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన బాలబాలికలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆనంద్ ఆదేశించారు.






