ఓట్ల పై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

by Batti.Sumithra |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

ఓట్ల పై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని వడ్డేపల్లి గార్డెన్ లో ఎస్ఐఆర్ సర్వే పై పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పట్టణాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బీఎల్వోలతో సమన్వయం చేసుకుని ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని అన్నారు. ముఖ్యంగా స్థానికంగా లేని ఓటర్ల వివరాల పై ప్రత్యేక దృష్టి సారించి మ్యాపింగ్ పూర్తి చేయాలని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీ, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story