- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS ENG : స్టేడియానికి ఆలస్యంగా వచ్చిన భారత క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
వర్షం కారణంగానో లేదా వాతావరణం అంతరాయం కారణంగానో క్రికెట్ మ్యాచ్‌లో టాస్ ఆలస్యం కావడం, మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం జరగడం సాధారణమే.

దిశ, స్పోర్ట్స్ : వర్షం కారణంగానో లేదా వాతావరణం అంతరాయం కారణంగానో క్రికెట్ మ్యాచ్‌లో టాస్ ఆలస్యం కావడం, మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం జరగడం సాధారణమే. కానీ, ఓ జట్టు సమయానికి స్టేడియానికి రాకపోవడం ద్వారా మ్యాచ్ ఆలస్యం కావడం అరుదుగా జరుగుతుంది. ఈ కారణంగానే భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టీ20 ఆలస్యంగా మొదలైంది. టీమిండియా సమయానికి గ్రౌండ్ వద్దకు చేరుకోలేదు. దీంతో టాస్ ఆలస్యమైంది. సౌతాంఫ్టన్‌లో భారత క్రికెటర్లు ప్రయాణిస్తున్న టీమ్ బస్సు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో ప్లేయర్లు టాస్ సమయానికి (6:30) స్టేడియానికి రాలేకపోయారు. భారత కాలమానం ప్రకారం 6:35కు చేరుకున్నారు. దీంతో టాస్‌ను 7:15 గంటలకు రీషెడ్యూల్ చేశారు. 7 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా 7:30 గంటలకు ప్రారంభమైంది.
వైభవ్‌పై వేటు.. తుది జట్టులోకి శాంసన్
శాంసన్ నిరాశపర్చడంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని అతను కూడా సద్వినియోగం చేసుకోలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ఐదో టెస్టుకు టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టింది. దీంతో శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అలాగే, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్‌కు అవకాశం ఇచ్చారు.
- Tags
- India vs England






