- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర హోదాపై మా సహనం పరీక్షించవద్దు.. కేంద్రానికి ఒమర్ అబ్దుల్లా వార్నింగ్
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో కేంద్రం తన సహనాన్ని బలహీనతగా భావించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్దరించడం కోసం తగినసమయం రావాలని అనడంలో అర్థం ఏంటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో కేంద్రం తన సహనాన్ని బలహీనతగా భావించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్దరించడం కోసం తగినసమయం రావాలని అనడంలో అర్థం ఏంటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లడఖ్ ప్రతినిధులతో చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉండి, జమ్మూ కాశ్మీర్ ప్రజలతో చర్చలకు ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోదా డిమాండ్ పై జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ తలపెట్టిన నిరసనకు మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తన నాయనమ్మ అక్బర్ జహాన్ 26వ వర్థంతి కార్యక్రమం సందర్భంగా హజ్రత్ బాల్ లోని ఆమె సమాధి వద్ద జరిగిన కార్మికుల సదస్సులో ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం సహనమేనని చెప్పారు. ఆమె చూపించినట్టుగానే సహనం వహించాలని అన్నారు. కానీ సహనం బలహీనతకు మార్గం కాదని చెప్పారు. సహనమే తమ గళం, అదే తమ బలం అని అన్నారు.






