- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది నవంబర్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. రెండు దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాలను పురస్కరించుకుని ఈ రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మ్యాచ్‌లను ప్రకటించారు. నవంబర్ 12న ఆక్లాండ్‌లో తొలి మ్యాచ్, 15వ తేదీన క్రైస్ట్‌చర్చ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొన్న న్యూజిలాండ్ గ్రూపు దశలోనే నిష్ర్కమించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు రెండుసార్లు మాత్రమే ఎదురుపడ్డాయి. 1981లో జరిగిన మొదటి మ్యాచ్ 0-0తో డ్రా అయ్యింది. మళ్లీ 2018లో తలపడగా అప్పుడు 2-1తో న్యూజిలాండ్ గెలిచింది.
Next Story






