- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల్లో హార్మోనల్ సమస్యలు.. ఇవి కూడా కారణమేనా?
ప్రతి రోజూ సగటు మహిళ 168 సింథటిక్ రసాయనాలకు గురవుతున్నదని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : మహిళల్లో హార్మోనల్ రిలేటెడ్ సమస్యలకు పోషకాహార లోపాలే కారణం అనుకుంటారు కొందరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రకరకాల బాహ్య ప్రభావాలు, జీవన శైలిలో మార్పులు, ఆధునిక పోకడలు సైతం అందుకు దోహదం చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటివాటిలో సింథటిక్ కెమికల్స్ కూడా ఉంటున్నాయని చెబుతున్నారు. అయితే నేటి మహిళలు వీటికి ఎలా గురవుతున్నారు? ఏయే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
ప్రతి రోజూ ఇంటి నుంచి బయలుదేరే ముందు సగటు మహిళ షాంపూ మొదలు కొని లిప్‌స్టిక్ వరకు వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడంతో సుమారు 168 సింథటిక్ రసాయనాలకు గురవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం సాధారణ రసాయనాలు మాత్రమే కాదు.. ఎండక్రైన్ డిస్‌రప్టర్స్ (Endocrine Disruptors) అని కూడా పిలుస్తున్నారు. వివిధ లోషన్లు, సౌందర్య సాధనాల రూపంలో మహిళలే వీటిని స్వయంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఇవే శరీరంలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల వ్యవస్థను నేరుగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా హార్మోనల్ ఇంబాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ సమస్యలు, ఫెర్టిలిటీ సమస్యలు, డిప్రెషన్ వంటివి సాధారణం అవుతున్నాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అంతేకాదు ఇవి దీర్ఘకాలికంగా క్యాన్సర్, న్యూరోలాజికల్ సమస్యలకు కూడా దారి తీయవచ్చు!
హానికారకాలు
*షాంపూ: కేవలం దీనివల్లనే సగటున 15 రసాయనాలకు గురవుతారు. ఇందులోని Sodium Lauryl Sulphate (SLS), Propylene Glycol వంటివి చర్మం, కళ్లు, ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగించి, న్యూరోలాజికల్ డ్యామేజ్‌కు కారణమవుతాయి.
*ఐషాడో: కళ్లపై అందం కోసం అలంకరించుకునే ఈ రంగులో 26 రసాయనాలు ఉంటాయి. Polyethylene Terephthalate వంటి ప్లాస్టిక్ డెరైవేటివ్స్ క్యాన్సర్, ఇన్‌ఫెర్టిలిటీకి దోహదపడతాయి.
*లిప్‌స్టిక్: 33 రసాయనాలు (తినే అవకాశం ఉండటం వల్ల మరింత ప్రమాదకరం)
*పెర్ఫ్యూమ్: ఒక్క పెర్ఫ్యూమ్‌లోనే 250 వరకు రసాయనాలు (Benzaldehyde, Toluene) ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి హార్మోన్ల విచ్ఛిన్నత(Disruption), క్యాన్సర్లకు కారణం అవుతాయి. వీటితోపాటు బాడీ లోషన్, డియోడరెంట్, నెయిల్ పాలిష్, హెయిర్ స్ప్రే, బ్లష్ వంటి ఉత్పత్తులు ఈ రసాయనాల లోడ్‌ను మరింత పెంచుతాయి.
*పరిష్కారం: సహజమైన, ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవడమే దీనికి చక్కటి పరిష్కారం. అలాగే ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనేముందు దానిపై లేబుల్స్ చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. కెమికల్-ఫ్రీ షాంపూ, కెమికల్ ఫ్రీ సోప్, రసాయనాలు కలువని కాస్మెటిక్స్ వాడాలని చెబుతున్నారు. ఇలా చేస్తే హార్మోన్ల సమతుల్యం మెరుగుపడి, ఆరోగ్యం మెరుగవుతుంది. మీ రోజువారీ ఉత్పత్తులను సమీక్షించడం ద్వారా ఈ అనవసరమైన రసాయనాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






