- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amazon: ప్రీమియం ఉత్పత్తులవైపు మళ్లుతున్న కస్టమర్లు
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ప్రీమియం ఉత్పత్తుల కొనుగోళ్లు ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాల్లోనూ వేగంగా పెరుగుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు ధోరణిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఇటీవల కంపెనీ నిర్వహించిన ప్రైమ్‌డే సేల్‌లో ఎక్కువమంది కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులు కొనేందుకునే ఎక్కువ ఆసక్తి చూపించారని అభిప్రాయపడింది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ప్రీమియం ఉత్పత్తుల కొనుగోళ్లు ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాల్లోనూ వేగంగా పెరుగుతున్నాయి. కంపెనీ ప్రైమ్ సేల్ ఆధారంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది సేల్‌లో ప్రీమియం బ్యూటీ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు, రూ.2,500కుపైగా ధర ఉన్న గ్రూమింగ్ ఉత్పత్తులు రెట్టింపు, రూ.35 వేలకుపైగా విలువైన టీవీల విక్రయాలు కూడా రెండు రెట్లు పెరిగాయి. 65 అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్ టీవీలకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. అలాగే హార్లీ-డేవిడ్‌సన్, కేటీఎం, ట్రయంఫ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి బ్రాండ్లకు చెందిన రూ.1.5 లక్షలకుపైగా ధర ఉన్న ప్రీమియం మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2.3 రెట్లు పెరిగాయి. వీటిని కొనుగోలు చేసిన వారిలో దాదాపు 70 శాతం మంది చిన్న నగరాల వినియోగదారులే కావడం విశేషం. అంతర్జాతీయ కిచెన్ బ్రాండ్లు, ప్రీమియం ట్రావెల్ లగేజీ, ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, కాఫీ మెషీన్లు, స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు వంటి హైఎండ్ ఉత్పత్తులకూ అధిక డిమాండ్ కనిపించిందని కంపెనీ పేర్కొంది.






