- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం వికటించి వ్యక్తి మృతి..
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాన్వి ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాన్వి ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన సామర్తి నరసింహ(50) ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటూ టైలరింగ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆయన గత కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న నరసింహ శుక్రవారం సాయంత్రం మంచాల్ రోడ్డులోని శాన్వి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాడు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో శనివారం ఉదయం తిరిగి అదే ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సందర్భంగా నరసింహకు షుగర్ స్థాయి అధికంగా ఉందని వైద్యులు చెప్పి చికిత్స అందించారని, అనంతరం ఆయనకు అధిక మోతాదులో ఇంజెక్షన్లు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించాలని శాన్వి ఆసుపత్రి వైద్యులు సూచించినట్లు తెలిపారు. దీంతో వెంటనే నరసింహను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు శాన్వి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతుడు నరసింహ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.






