ఆలోచన అదుర్స్.. స్టార్టర్ డబ్బా సేఫ్

by Jakkula.Mamatha |

మరికల్ మండలం పూసల్ పహాడ్ గ్రామానికి చెందిన రైతు కొల్లంపల్లి శ్రీశైలం వినూత్న ఆలోచనతో తన బోరు స్టార్టర్ డబ్బాను ఎండ, వాన, దుమ్ము నుంచి రక్షించేందుకు పాడైపోయిన పాత ఫ్రిడ్జ్ డబ్బాను అమర్చాడు.

ఆలోచన అదుర్స్.. స్టార్టర్ డబ్బా సేఫ్
X

దిశ, మరికల్: మరికల్ మండలం పూసల్ పహాడ్ గ్రామానికి చెందిన రైతు కొల్లంపల్లి శ్రీశైలం వినూత్న ఆలోచనతో తన బోరు స్టార్టర్ డబ్బాను ఎండ, వాన, దుమ్ము నుంచి రక్షించేందుకు పాడైపోయిన పాత ఫ్రిడ్జ్ డబ్బాను అమర్చాడు. పనికిరాని వస్తువును కొత్త అవసరానికి వినియోగిస్తూ స్టార్టర్‌కు తక్కువ ఖర్చుతో శాశ్వత రక్షణ కల్పించిన ఆయన ఆలోచన స్థానిక రైతులను ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న విధానం ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.

Next Story